TEAM INDIA :ఫ్యూచర్ ఆటగాళ్లు!

18
- Advertisement -

టీమిండియా ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, అశ్విన్.. మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ యువ ప్లేయర్సే. సాధారణంగా యువ ఆటగాళ్లు జట్టులో కుదురుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ టీమిండియా యంగ్ ప్లేయర్స్ మాత్రం ఆరంభ దశ నుంచే సత్తా చాటుతు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా తమ వంతు పాత్ర పోషిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవడంలో యంగ్ ప్లేయర్స్ కీలక పాత్ర పోషించారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురేల్, గిల్,.. ఇలా ప్రతి యంగ్ ప్లేయర్ అద్బుతంగా రానిస్తూ భవిష్యత్ ఆశాకిరణంలా మారుతున్నారు. ఇంగ్లాండ్ పై జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ లో యశస్వి జైస్వాల్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అందరం చూశాం.

ఏకంగా వరుసగా రెండు సార్లు డబుల్ సెంచరీలు చేసి ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించాడు. ఇక ఆరంగేట్ర మ్యాచ్ తోనే ఆఫ్ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్ ఆ తరువాత మ్యాచ్ లలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. ఇక నిన్న పూర్తయిన నాలుగో టెస్టు విజయం సాధించడంలో దృవ్ జూరెల్ పాత్ర చాలానే ఉంది. జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడూ మంచి స్కోరు అందించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ప్రతి యువ ప్లేయర్ కూడా ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా.. జట్టు విజయంలో తమ పాత్ర పూర్తిగా నిర్వర్తిస్తుండడం ఫ్యూచర్ టీమిండియా మరింత పటిష్టంగా మారుతుందని మాజీలు అభిప్రాయ పడుతున్నారు. అయితే యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తుండడంతో సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్.. వంటివారు జట్టులో ఎక్కువ రోజులు కొనసాగడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Also Read:‘ఓం భీమ్ బుష్’ లాంటి సినిమా చూసుండరు:శ్రీవిష్ణు

- Advertisement -