మానవుని పుట్టుక నుంచి ఇప్పటివరకూ తనకు సొంతంగా పెంపుడు జంతువులతో మమేకమయి జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కుక్క పిల్లి రామచిలుకలను పెంచుకుంటారు. జీవనోపాధి కోసం ఆవులను పశువులను పెంచుకుంటారు. మరికొంతమంది ఇంకాస్త పాములను పులులను మొసళ్లను పెంచుకుంటారు. అయితే ఇగ్వానా అనే ఊసరవెల్లి జాతికి చెందిన ఇగ్వానాతో పుచ్చకాయ ముక్కను షేర్ చేసిన ఓ యువకుడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే నీకో ముక్కా నాకో ముక్క అంటూ ఉన్నట్టు కనిపిస్తుంది.
ఈ వీడియోలో ఒక ఇగ్వానా పుచ్చకాయ ముక్కను తినడం మనం చూడొచ్చు. అతను తింటూ ఉంటే.. వెనకే ఉన్న ఇగ్వానా కూడా ముందుకొచ్చి.. ఓ ముక్కను కొరుక్కుంది. దానికి పుచ్చకాయ రుచి బాగా నచ్చడంతో.. రెండోసారి పెద్ద ముక్కే కొరికింది. ఇలా ఇద్దరూ పుచ్చకాయ ముక్కను తిన్న వీడియో వైరల్ అయ్యింది. దీన్ని ట్విట్టర్ లోని @buitengebieden అకౌంట్‌లో నవంబర్ 2, 2022న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ.. లక్షల మంది చూశారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ..
Sharing is caring.. 😅
🎥 IG: lizardthebuddy pic.twitter.com/mXUGWjbejl
— Buitengebieden (@buitengebieden) November 2, 2022
ఇవి కూడా చదవండి…