నితిన్ బాట‌లో నాగ‌శౌర్య‌..

642
nitin, nagashourya
- Advertisement -

భిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ స‌క్సెస్ ను సాధిస్తున్నాడు యంగ్ హీరో నాగ‌శౌర్య‌. నాగ‌శౌర్య గ‌తంలో న‌టించిన సినిమాలు వ‌రుస ప‌రాజ‌యాల‌ను ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఇటివ‌లే ఆయ‌న న‌టించిన ఛ‌లో సినిమా భారీ విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. ఈమూవీని తానే స్వ‌యంగా నిర్మాంచారు. సొంత బ్యాన‌ర్ లో మొద‌టిసారిగా సినిమాను నిర్మించి బాక్సాఫిస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టాడు. ఈయంగ్ హీరో ల‌వ‌ర్ బాయ్ నితిన్ ఫాలో అవుతున్న‌ట్లు తెలుస్తుంది.

nithiin-ishq

4సంవ‌త్స‌రాల క్రితం నితిన్ వ‌రుస‌గా 12 సినిమాలు ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే. ఇక అప్ప‌ట్లో నితిన్ ప‌ని అయిపోయింది అనుకున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. త‌న‌తో ఏప్రోడ్యూస‌ర్లు సినిమా తీయ‌డానికి ధైర్యం చేయ‌క‌పోయే స‌రికి తానే నిర్మాత‌గా మారి ఇష్క్ సినిమాను తెర‌కెక్కించాడు. ఈసినిమా భారీ విజ‌యాన్ని అందుకుంది. ఆత‌ర్వ‌త వ‌చ్చిన గుండెజారి గ‌ల్లంద‌య్యిందే సినిమా కూడా పెద్ద హిట్ గా నిలిచింది. అప్ప‌టి నుంచి నితిన్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చి బిజీగా గ‌డుపుతున్నాడు.

chalo

యంగ్ హీరో నాగ‌శౌర్య కూడా నితిన్ ను ఫాలో అవుతున్నాడు. గ‌త సంవ‌త్స‌రం వ‌ర‌కూ నాగ‌శౌర్య న‌టించిన సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో తానే నిర్మాత‌గా మారి ఛ‌లో అనే సినిమాను తీసి భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. ఆ త‌ర్వ‌త న‌ర్త‌నశాల సినిమాతో మ‌ళ్లీ త‌న బ్యాన‌ర్ లోనే సినిమాను చేస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈసినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -