యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథా చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. మోక్ష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమా నుంచి నాన్న సాంగ్ ని లాంచ్ చేశారు. కంపోజర్ శశాంక్ తిరుపతి ఈ పాటని హార్ట్ టచ్చింగ్ బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. చిలుకూరి ఆకాష్ రెడ్డి లిరిక్స్ ఆకట్టుకునేలా వున్నాయి. అంజనా బాలకృష్ణన్, శ్రాగ్వి ప్లజంట్ వోకల్స్ ఫీల్ గుడ్ వైబ్ ని క్రియేట్ చేశాయి.
ఈ మూవీలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోదిన, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి ఇతర ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.ప్రేమ్ సాగర్ కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జే సి శ్రీకర్ ఎడిటర్.
Also Read:ఆకట్టుకుంటున్న ‘శ్వాగ్’ టీజర్