సీనయ్యకు విలన్ దొరికేశాడు..

358
seenayya
- Advertisement -

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ హీరోగా సీనయ్య అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నరసింహారావు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈమూవీలో వినాయక్ మెకానిక్ పాత్రలో కనిపించనున్నాడు.

కాగా ఈసినిమాలో వినాయక్ కు విలన్ కోసం వెతికారు చిత్రయూనిట్. ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. నవీన్ ‘నేను లోకల్’, ‘అరవింద సమేత’ వంటి పలు చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. వినాయక్ సీనయ్య కూడా విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -