‘ఎన్టీఆర్ 30’లో యంగ్ హీరో ?

43
- Advertisement -

వరుస స‌క్సెస్‌ల‌తో జోష్ మీదున్న ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాలతో దేవ‌ర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర‌ను పేరున్న న‌టీన‌టులతోనే చేయించాల‌నే ఉద్దేశంతో కొర‌టాల ప‌క్క ఇండ‌స్ట్రీల నుంచి కూడా యాక్ట‌ర్స్‌ను తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోను తీసుకున్నార‌ని, క‌థ‌ను మ‌లుపు తిప్పేలా ఉండే ఆ క్యారెక్ట‌రే మూవీలో అస‌లైన సస్పెన్స్ అని స‌మాచారం. ఎంతైనా ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక వచ్చే వారం నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొననుంది. ఇక కొరటాల శివ కథకే కాదు, కథ జరిగే నేపథ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరగనుంది. సినిమాలో విజువల్స్ అదిరిపోతాయట. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు.

Also Read:రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తే..

ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. కేవలం ఈ సీక్వెన్స్ లను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను ఈ సినిమాకు తీసుకున్నారు.

ALso Read:సిద్దరామయ్యకు కలవరం.. బీజేపీ ప్లాన్ అదే !

- Advertisement -