- Advertisement -
యంగ్ ఫిల్మ్ మేకర్స్ అవార్డ్స్–2025కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కార్యక్రమం నిర్వహణ ఖర్చు కోసం రూ. 30 లక్షల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది.
అవార్డు ఫంక్షన్ నిర్వహణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేశారు. అవార్డుల పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ గా దర్శకుడు దశరథ్‌ను నియమించారు.
కమిటీకి కన్వీనర్ గా TGFDCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకంకాగా సభ్యులుగా దర్శకుడు హరీష్ శంకర్, కళాకారుడు బలగం వేణు, పి.జి.వినోద్, రాహుల్ సిప్లిగంజ్, చరణ్ అర్జున్, లక్ష్మీ ఉన్నారు. TGFDCL ద్వారా అవార్డుల కార్యక్రమం నిర్వహణ జరగనుంది.



- Advertisement -

