సీనియర్స్ కు చెక్ పెడుతున్న జూనియర్స్?

41
- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర దర్శకులు సత్తా చాటుతున్నారు. వారియొక్క టాలెంట్ తో స్టార్ హీరోలను సైతం ఇంప్రెస్ చేస్తున్నారు. కొత్త కథలు, సరికొత్త స్క్రీన్ ప్లేతో వారి టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఫలితంగా యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇచ్చేందుకు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, ప్రభాస్ వంటి అగ్రహీరోలు ఇప్పటికే కుర్ర దర్శకులతో కమిట్ అయ్యారు కూడా. యంగ్ డైరెక్టర్స్ కు ఛాన్స్ లు ఇవ్వడంలో ప్రభాస్ ఒక్క అడుగు ముందే ఉన్నడని చెప్పవచ్చు. బాహుబలి సిరీస్ తరువాత సుజిత్, రాధాకృష్ణ వంటి కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్.. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కల్కి 2898 ఏడి మూవీ పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. .

ఈ మూవీని రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా RC16 మూవీని యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేయబోతున్నాడు. బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అంచిందిన సంగతి తెలిసిందే. తన రెండో సినిమాతోనే గ్లోబెల్ స్టార్ రాంచరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇక చిరు కూడా యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడంలో ముందే ఉన్నారు.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 100 కోట్లు

వాల్తేరు వీరయ్యతో బాబీకి ఛాన్స్ ఇచ్చి హిట్ కొట్టిన చిరు ప్రస్తుతం భొళా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత యంగ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయబోతున్నట్లు టాక్. ఇంకా వెంకీ కుడుముల తో కూడా చిరు ఓ మూవీకి కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా స్టార్ హీరోలంతా యంగ్ డైరెకర్స్ కు ఛాన్స్ లు ఇస్తుంటే త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి వంటి దర్శకులు స్టార్స్ తో ఒక్కో సినిమాతోనే సరిపెట్టుకుంటున్నారు. కుర్ర దర్శకుల జోరు ఇదే రీతిలో కొనసాగితే సీనియర్స్ దర్శకులు చెక్ పడినట్లేనని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

Also Read:అందరిని ఆకట్టుకునే ‘దయా’ వెబ్ సిరీస్

- Advertisement -