ఉప్పొంగే సంద్రం…’క్యాస్ట్రో’

271
- Advertisement -

ఫిడెల్ కాస్ట్రో.. ఈ పేరు వింటే ఒక ఉప్పొంగే సముద్రం గుర్తుకు వస్తుంది. విరుచుకుపడే ఉద్యమ కెరటం స్ఫురణకు వస్తుంది.క్యూబా నిర్మాణం కోసం అహర్నిషలు కష్టపడ్డారు…. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అకుంఠిత దీక్ష, పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు.. కోట్లాదిమంది ప్రజల ఆదరణ పొందాడు.. అనేక సంచలన నిర్ణయాలతో అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించారు.. అమెరికా కుట్రలను తిప్పికొట్టి మృత్యుంజయుడిగా బయటపడ్డారు.. ఇప్పటికీ ఆ దేశ హీరో ఎవరంటే క్యాస్ట్రో పేరే చెబుతారు అక్కడిప్రజలు…. నియంత పాలన సంకెళ్లనుంచి దేశాన్ని విడిపించేందుకు క్యాస్ట్రో చేసిన పోరాటం అనేక ఉద్యమాలకు దిక్సూచీలా నిలిచింది.. ఈ యోధుడి మరణం తమ దేశానికి తీరని లోటని క్యూబా ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. డిసెంబర్ 4న క్యాస్ట్రో అంత్యక్రియలు జరగనున్నాయి.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

క్యాస్ట్రో క్యూబాలోని మయారి పట్టణానికి సమీపంలోని ఉన్న బిరాన్ గ్రామంలో జన్మించారు.. క్యాస్ట్రో తండ్రి స్పెయిన్ దేశం నుంచి వలస వచ్చిన చెరకు తోటల పెంపకం దారుడు. కాస్ట్రో తల్లి లీనా రుజ్ గొంజాలెజ్ పనిమనిషిగా చేసేవారు. చిన్నతనంనుంచి క్యాస్ట్రో చురుగ్గాఉండేవారు.. ఉద్యమాల్లో పాల్గొనేవారు.. 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలోచేరిన ఫిడేల్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తూనే 1952లో క్యూబా ప్రతినిథుల సభ కోసం జరగబోయే ఎన్నికల్లో పోటీచేశారు. అయితే అదే సమయంలో బాటిస్టా…. మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు. కాస్ట్రో…. బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించారు.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

జూలై 26, 1953 న కాస్ట్రో దళాలు క్యూబాలోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడిన క్యాస్ట్రోకు 15ఏళ్ల జైలుశిక్ష విధించారు.. 1955లో బాటిస్టా ఫిడేల్‌ను విడుదల చేశాడు. జైలునుంచి బయటకువచ్చిన కాస్ట్రో జూలై 26 ఉద్యమం అనే పేరుతో విప్లవ దళాన్ని నిర్మించారు.మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం 1956 డిసెంబరులో క్యూబాలో కాలు పెట్టింది. ప్రజలనుంచి క్యాస్ట్రోకు లభించిన ఆదరణచూసిన బాటిస్టా జనవరి 1, 1959 న దేశం విడిచి పారిపోయాడు.. ఆ తర్వాత క్యూబా నాయకుడిగా క్యాస్ట్రో అధికారాన్ని చేపట్టారు.

అధికారాన్ని చేపట్టిన వెంటనే క్యాస్ట్రో అమెరికాతోసహా విదేశీయులతోపాటు.. పలువురు స్వదేశీయుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు… ఈ చర్యలతో అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి.. అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా అవసరాలకోసం క్యాస్ట్రో సోవియట్ యూనియన్‌కు దగ్గరయ్యారు.. క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశారు…. వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించారు.ఈ నిర్ణయాలతో ధనవంతులైన క్యూబన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో యూఎస్‌ ఆగ్రహించింది.. 1960లో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకుంది.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

1961లో క్యూబా నుండి ప్రవాసం వచ్చిన వారి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికా ప్రయత్నించింది.. ఈ ఘటన తరువాత కాస్ట్రో మరింతగా సామ్యవాదం వైపు దృష్టిపెట్టాడు… సోవియట్ యూనియన్ తో బలమైన బంధాలను ఏర్పాటుచేసుకున్నాడు.. యూనియన్‌నుంచి ఆర్థిక, సైనిక పరమైన సహాయాలను పొందారు.. వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా క్యాస్ట్రో ఎదిగాడు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో విప్లవోద్యమాలకు సహాయం చేశారు… కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్లకు మెరుగైన విద్య, ఆరోగ్య సౌకర్యాలను కల్పించింది..

1991లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు. క్యాస్ట్రోను హత్య చేసేందుకు సీఏఐ 638 సార్లు ప్రయత్నించి విఫలమైంది. కానీ ప్రతిసారి విఫలమైంది.వృద్ధాప్యం మీదపడటంతో తన తమ్ముడు రౌల్‌ క్యాస్ట్రోకు ఫిడేల్‌ బాధ్యతలు అప్పగించాడు.. 2008లో పరిపాలనా బాధ్యతలనుండి ఫిడెల్ కాస్ట్రో తప్పుకున్నాడు.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

2014లో చైనా శాంతి బహుమతి

కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం ఎంతో కృషి చేసిన క్యాస్ట్రోకు 2014లో చైనా శాంతి బహుమతి లభించింది. నోబెల్‌ శాంతి పురస్కారానికి సమాంతరంగా 2010 నుంచి కన్ఫ్యూసియస్‌ శాంతి బహుమతి పేరుతో ఏటా దీన్ని చైనా అందిస్తోంది. నోబెల్‌ శాంతి పురస్కారాన్ని మలాలా, కైలాష్‌ సత్యార్థి స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆయన ఈ కన్ఫ్యూసియస్‌ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

క్యాస్ట్రో మాటలు తూటాలు..

అగ్ర‌రాజ్యానికి వ‌ణుకు పుట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో.. తూటాల్లాంటి త‌న మాట‌ల‌తోనే దేశ ప్ర‌జ‌ల‌ను ఉత్తేజితుల‌ను చేశారు.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

న‌న్ను ఖండించండి. అది అంత గొప్ప విష‌యం కాదు. చ‌రిత్ర న‌న్ను గుర్తిస్తుంది. – 1953లో మోన్‌కాడా మిలిట‌రీ బరాక్స్‌పై దాడి ఘ‌ట‌న విచార‌ణ‌లో త‌న‌ను తాను స‌మ‌ర్థించుకున్న సంద‌ర్భంలో క్యాస్ట్రో.

విప్ల‌వం వల్ల క‌లిగిన ప్ర‌యోజ‌నాల్లో అత్యుత్త‌మ‌మైన‌ది ఏంటంటే మా వేశ్య‌లు కూడా కాలేజీ గ్రాడ్యుయేట్సే. – 2003 కమాండంట్ డాక్యుమెంట‌రీలో క్యాస్ట్రో

నేను 82 మందితో విప్ల‌వాన్ని మొద‌లుపెట్టాను. అదే విప్ల‌వాన్ని మ‌ళ్లీ మొద‌లుపెట్టాలంటే ప‌ది, ప‌దిహేను మందితో అయినా స‌రే.. అదే న‌మ్మ‌కంతో మొద‌లుపెడ‌తాను. నువ్వు ఎంత చిన్నవాడివ‌న్న‌ది ముఖ్యం కాదు.. నీ న‌మ్మ‌కం, కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికే ముఖ్యం. – 1959లో ప్ర‌ధానిగా ఎన్నికైన స‌మ‌యంలో క్యాస్ట్రో

నేను నా గ‌డ్డాన్ని తీయాల‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే నా గ‌డ్డానికి నేను అల‌వాటు ప‌డ్డాను. దేశానికి మంచి పాల‌న అందించాల‌న్న నా క‌ల నెర‌వేరిన‌ప్పుడు ఈ గ‌డ్డాన్ని తీసేస్తా. – 1959లో విప్ల‌వాన్ని మొద‌లుపెట్టిన 30 రోజుల త‌ర్వాత సీబీఎస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్యాస్ట్రో

క్యూబా ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం నేను చేయాల్సిన చివ‌రి త్యాగం పొగ‌తాగ‌డాన్ని మానేయ‌డ‌మ‌ని నేను చాలా రోజుల కింద‌టే నిర్ణ‌యానికి వ‌చ్చాను. స్మోకింగ్‌ను నేను మిస్స‌యిన ఫీలింగ్ లేదు- 1985లో సిగార్ స్మోకింగ్ వ‌దిలేసిన త‌ర్వాత క్యాస్ట్రో

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

ప్ర‌పంచంలో సోష‌లిస్ట్ క‌మ్యూనిటీ మాయ‌మైపోతే ఏం జ‌రుగుతుందో ఓ సారి ఊహించుకోండి.. అది సాధ్య‌మేనా? అది సాధ్యం కాద‌న్న‌దే నా విశ్వాసం. – 1989లో క్యాస్ట్రో

క్యూబ‌న్ విధానం ఇక మాకు కూడా ఏమాత్రం ప‌నిచేయ‌దు. – 2010లో అమెరికా జ‌ర్న‌లిస్ట్ గోల్డ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్యాస్ట్రో. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుడు అర్థంలో వాడారాని ఆ త‌ర్వాత క్యాస్ట్రో అన్నారు.

అమెరికాతో చేయ‌బోయే యుద్ధ‌మే నా అంతిమ గమ్య‌మ‌ని నేను గుర్తించా. – 2004 లుకింగ్ ఫ‌ర్ ఫిడెల్ డాక్య‌మెంట‌రీలో క్యాస్ట్రో తొలి మాట ఇది.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

నేను 80 ఏళ్లు బ‌తికానంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ ఊహించ‌లేదు. ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తిమంత‌మైన అమెరికా ప్ర‌తి రోజు న‌న్ను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నా ఇన్నాళ్లు బ‌తుకాన‌ని ఊహించ‌లేదు. – 2006లో అర్జెంటీనాలో జ‌రిగిన లాటిన్ అమెరిక‌న్ అధ్య‌క్షుల స‌మావేశంలో క్యాస్ట్రో.

ఫిడెల్ క్యాస్ట్రో మృతి ప‌ట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. భార‌త్ గొప్ప స్నేహితుడిని కోల్పోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. 20వ శతాబ్ద‌పు ప్ర‌పంచ గొప్ప‌నేత‌ల్లో క్యాస్ట్రో ఒక‌ర‌ని ఆయ‌న అన్నారు. భార‌త్ ఆయ‌న‌ మృతికి సంతాపం తెలుపుతోంద‌ని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మ‌రోవైపు ఫిడెల్ క్యాస్ట్రో మృతిప‌ట్ల కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, వామపక్ష నేతలు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డిలు సంతాపం తెలిపారు.

YOU MUST KNOW ABOUT FIDEL CASTRO

- Advertisement -