అవినీతి కేసు..యోషితా రాజ‌ప‌క్స‌ అరెస్ట్

1
- Advertisement -

శ్రీలంక మాజీ దేశాధ్య‌క్షుడు మ‌హింద రాజ‌ప‌క్స కుమారుడు యోషితా రాజ‌ప‌క్స‌ కు షాక్ తగిలింది. యోషితా రాజపక్సను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ ప్రాప‌ర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజ‌ప‌క్స పాత్ర ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు రగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదే కేసులో మాజీ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్స‌ను కూడా విచారించారు. త‌న‌కు సెక్యూర్టీ క‌ల్పించాల‌ని కోరుతూ ప్రాథ‌మిక హ‌క్కుల కింద మ‌హింద రాజ‌ప‌క్స సుప్రీంకోర్టులో పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ కుమారుడిని అరెస్టు చేయ‌డం శ్రీలంక‌లో సంచ‌ల‌నంగా మారింది.

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో అనుర కుమార దిశ‌నాయ‌కే.. శ్రీలంక‌ అధ్య‌క్షుడిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రెడ్ అలర్ట్

- Advertisement -