యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి పొందడంతో సొంత పార్టీనేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతి వల్లనే బీజేపీ ఓడిపోయిందని ఆ పార్టీ నేతలే విమర్శించిన విషయం తెలిసిందే. ఇక యూపీలో రూ.6 వేల కోట్లతో మెగా ఫుడ్ పార్క్ స్థాపించాలనుకున్న పతంజలి సంస్థ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు చెబుతోంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న యోగి వెంటనే పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈ మెగాఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టును యమునా ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 425 ఎంకరాల్లో ఏర్పాటు చేయాలని భావించామని, కానీ యోగి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందచడం లేదని, అనుమతుల కోసం చాలా కాలం ఎదురు చూశాం. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలినా ఫలితం లేదని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ అన్నారు.
ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మితమైతే ఎంతో మంది రైతులు, కూలీలు బాగుపడతారని, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. రాందేవ్ బాబాతో మాట్లాడిన సీఎం యోగి ప్రాజెక్టు యూపీలోనే ఏర్పాటు అయ్యేలా బాబాను ఒప్పించాడో లేదో చూడాలి ఇక.