దేశంలో పెళ్లి కాని ముఖ్యమంత్రుల జాబితా పెరిగిపోతోంది. ఈ జాబితాలో తాజాగా ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరారు. 44 ఏళ్ల ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ మఠాధిపతి. వివాహం, కుటుంబానికి దూరంగా ఉన్న యోగి.. సన్యాసం స్వీకరించారు. గోరఖ్ పూర్ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ సీఎంగా ప్రమాణం చేశారు.
ఇక ఇటీవల ఉత్తరాఖండ్ పీఠంపై కూర్చున్న త్రివేంద సింగ్ రావత్ (55)కు కూడా పెళ్లి కాలేదు. ఇక హర్యానా సిఎం ఎంఎల్ ఖట్టర్ (62), అసోం సిఎం సర్బానంద సోనోవాల్ (54), ఒడిషా సిఎం, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ (70), పశ్చి మ బెంగాల్ సిఎం మమత బెనర్జీ (62) కూడా ఓ ఇంటివారు కాకుండానే సిఎం ఇంటివారయ్యారు.
ఇందులో పట్నాయక్, మమత మినహాయిస్తే ఇతరులు అంతా బిజెపి వారే. పెళ్లి బాదరబందీ లేని వారే. 2000 సంవత్సరం నుంచి ఒడిశా సీఎంగా నవీన్ కొనసాగుతున్నారు. ఇక మమత వరుసగా రెండో పర్యాయం బెంగాల్ సీఎం అయ్యారు. వీళ్లలో చాలామంది ఎన్నికల ప్రచారంలో పెళ్లి కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాము అవివాహితులమని, తమకు కుటుంబం లేదని, తాము మీ వాళ్లమేనని.. కుటుంబ పాలనకు, అవినీతికి చోటు ఉండదని ప్రజలను ఆకట్టుకున్నారు.
రాజకీయాలలో వెలుగొందుతున్న పెళ్లికాని నేతల లో రాహుల్ గాంధీ, మాజీ సిఎం మాయావతి, బిజెపి నాయ కురాలు ఉమా భారతి కూడా ఉన్నారు. జయలలిత కూడా పెళ్లి చేసుకోకుండానే గతించారు. పెళ్లి గురించి పలు సార్లు రా హుల్ గాంధీ విలేకరుల ప్రశ్నలకు గురి అయిన సందర్భాలు ఉన్నాయి. ఎంతకాలమీ ఒంటరి ప్రయాణం, ఎంగేజ్‌మెంట్ ఉం టుందా? అని విలేకరులు ప్రశ్నిం చినప్పుడు తరచూ రాహుల్ ఎన్ని కలు, రాజకీయాలతో ఎంగేజ్ అ యి ఉన్నట్లు, పెళ్లి గురించి ఆలో చించడం లేదని చెప్పారు. ఇప్పు డు కాకపోతే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారనే విలేకరుల పట్టు వదలని ప్రశ్నకు రాహుల్ ప లుసార్లు సరైన అమ్మాయి ఎదుర యినప్పుడు అని జవాబిచ్చా రు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పలువురు ప్రముఖులు పెళ్లిళ్లకు దూరం గానే ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్ కూడా సం ఘానికి కట్టుబడి పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇక బిజెపి దిగ్గ జం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బ్రహ్మచారిగా ఉ న్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజన్మ బ్రహ్మచారి.