యోగాంధ్ర సూపర్ హిట్!

3
- Advertisement -

యెగాంధ్ర సూపర్ హిట్ అయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన బాబు… వర్షం వస్తుందని భయపడ్డా.. కానీ వరుణుడు కరుణించాడు అన్నారు.మొట్టమొదటిసారి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించాం అన్నారు.

22 వేల మంది గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారు అన్నారు. ఈరోజు 3 లక్షల మందికిపైగా యోగా డేలో పాల్గొనడంతో మరో రికార్డు సాధించాం అన్నారు.

ప్రధాని మోదీ పదేళ్ల కృషి ఫలించింది అని… 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది యోగా డేలో భాగస్వామ్యం అయ్యారు అన్నారు. యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధాని మోదీని అభినందిస్తున్నా… ఏ చిన్న అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన మంత్రులు, అధికారులకు అభినందనలు చెప్పారు.

Also Read:TTD:భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు

- Advertisement -