యోగాతో శాంతి:మోడీ

290
modi yoga
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 60 వేల మంది యోగ సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. అంతకముందు మాట్లాడిన మోడీ తక్కువ కాలంలోనే యోగా ప్రజల్లో భాగమైందన్నారు. యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని తెలిపారు.

ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా వర్ధిల్లుతోందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు. వేగవంతంగా మారుతున్న నేటి కాలంలో యోగా.. వ్యక్తుల శరీరం, మెదడు, ఆత్మలను ఒక్కటిచేసి ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు.యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు.

 PM Modi  yoga

రాజస్థాన్‌లోని కోటాలో యోగా గురువు రాందేవ్ బాబా, సీఎం వసుంధర రాజే సింధియా పెద్ద సంఖ్యలో ప్రజల పాల్గొన్నారు. వారితో కలిసి రాందేవ్ బాబా యోగాసనాలు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు యోగాసనాలు వేశారు. ఏపీలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -