యేవ‌మ్..ఖచ్చితంగా అలరిస్తుంది: విశ్వ‌క్‌సేన్

10
- Advertisement -

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మాస్ క‌దాస్ విశ్వ‌క్‌సేన్, ద‌ర్శ‌కుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ హీరో న‌వ‌దీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వాయిలెన్స్ ఎక్కువ అని అర్థ‌మైంది. ఈ సీస్పెస్ అనే సంస్థ‌తో నిర్మాత‌గా టాలెంట్ యంగ్ పీపుల్‌కు న‌వ‌దీప్ మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన త‌రువాత అంద‌రూ ఆ సినిమాలోని చాలా త‌క్కువ మందితో ట‌చ్‌లో వుంటారు. ఇక నేను న‌టించి రెస్పెక్ట్ చేసే వాళ్ల‌లో చాందిని చౌద‌రి ఒక‌రు. టెన్ష‌న్ ప‌డే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందిని కి ఆ భ‌యం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు, ఫీమేల్ ఎడిట‌ర్‌, ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి ప‌నిచేయడం చాలా ఆనందంగా వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాల‌నేది నా కోరిక‌. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌టేసింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌రికి మంచి బ్రేక్‌నివ్వాలి అన్నారు.

చాందిని చౌద‌రి మాట్లాడుతూ ఈ సంవ‌త్స‌రం నా సినిమాలు వ‌రుస‌గా వ‌స్తాయ‌ని ఊహించ‌లేదు. అన్ని సినిమాలు అనుకోకుండా ఒకేసారి విడుద‌ల అవుతున్నాయి. నా ఇన్నేళ్ల కృషి ఇప్పుడు ఫ‌లితం చూపిస్తుంది. నా లైఫ్‌లో మెమెర‌బుల్ సినిమాను ఇచ్చిన సందీప్ రాజ్ నా కోయాక్ట‌ర్ విశ్వ‌క్‌సేన్‌కు థ్యాంక్స్‌. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎద‌రుచూస్తున్న త‌రుణంలో ఈ సినిమా వ‌చ్చింది. పోలీస్ పాత్ర అన‌గానే యాక్ష‌న్ ఓరియెంటెడ్‌గా నా పాత్ర వుంటుంద‌ని అనుకున్నాను. అయితే యాక్ష‌న్‌తో పాటు అన్ని షేడ్స్ నా పాత్ర‌లో వున్నాయి. త‌ప్ప‌కుండా యేవ‌మ్ అంద‌ర్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. అన్నారు.

సందీప్‌రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా థ్రిల్ల‌ర్‌లు చూసి వుంటాం. అందులో ఇది చాలా డిఫరెంట్‌గా వుంటుంది. నాకు బాగా న‌చ్చింది. ఇంట‌ర్వెల్‌, ప‌తాక స‌న్నివేశాలు మైండ్ బ్లోయింగ్ వుంటాయి. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌నిపించింది. ఈ సినిమాకు టెక్నిక‌ల్‌గా అన్ని బాగా కుదిరాయి. సినిమాలో అన్ని ఎమోష‌న్స్‌, వెరియేష‌న్స్ వున్నాయి. చాలా మంచి సినిమా అంద‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ప్ర‌తి చిన్న సినిమాకు విశ్వ‌క్ స‌పోర్ట్ వుంటుంది. ఈ సినిమాకు కూడా ఆయ‌న ప్రోత్సాహం అందించ‌డం ఆనందంగా వుంది అన్నారు.

న‌వ‌దీప్ మాట్లాడుతూ కంటెంట్ బెస్‌డ్ సినిమాల‌కు విశ్వ‌క్‌సేన్ లాంటి హీరోలు ప్ర‌మోష‌న్ విష‌య‌లో స‌పోర్ట్ వుంటుంది. ఈ విష‌యంలో విశ్వ‌క్ సూప‌ర్‌స్టార్ లాంటి వాడు. మంచి ఇంటెన్స్‌తో నిజాయితీగా చేసిన సినిమా ఇది. సినిమా మీద పిచ్చి త‌ప‌న వున్న హీరోయిన్ చాందిని చౌద‌రి, ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంది. రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా ఎప్పుడూ డిఫ‌రెంట్ సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల కోసం త‌ప‌న ప‌డుతుంది.త‌ప్ప‌కుండా ఈ చిత్రం చాందిని కెరీర్‌లో దిబెస్ట్‌గా వుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి మాట్లాడుతూ నా క‌థ‌ను, నా పాత్ర‌ను న‌మ్మి ఈ సినిమా చేసింది చాందిని. నాకు ఈ సినిమా విష‌యంలో నవ‌దీప్ స‌పోర్ట్ వుంది. ప్ర‌తి విష‌యంలో ఆయ‌న నాతో వున్నాడు. ఈ సినిమా చూసి సందీప్‌రాజ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ మాలో ధైర్యాన్ని నింపింది. కీర్త‌న్ నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ఎంతో ప్ల‌స్ అవుతుంది. ఈ సినిమా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు నేను ఊహించిన దానికంటే బెట‌ర్ అవుట్‌పుట్ ఇచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో ఓ మంచి సినిమా తీశాం. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్. త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుందే న‌మ్మ‌కం వుంది అన్నారు.

Also Read:జగన్ బాధితులకు బాబు ఆహ్వానం

- Advertisement -