మహేష్‌తో మూవీ.. మణిరత్నం క్లారిటీ..

114
mahesh

కొంతకాలం క్రితం దర్మకుడు మణిరత్నం – సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందని.. వారి మద్య చర్చలు జరిగాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అసలు ఈ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది? ఏం జరుగుతోంది? అన్న సందేహాలు పలువురి అభిమానుల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై మణిరత్నం స్పందించారు.

తాజా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించిన ప్రస్తావన రాగా, అది నిజమేనని ఆయన సమాధానమిచ్చారు మణిరత్నం. ఒక కథ విషయంలో మహేష్‌ను కలిసి మాట్లాడటం జరిగిందనీ, అయితే కొన్ని కారణాల వలన అది వర్కౌట్ కాలేదని అన్నారు. కథలను బట్టే తాను నటీనటులను ఎంపిక చేస్తూ ఉంటాననీ, నేరుగా తెలుగులో ఒక సినిమా చేసే ఆలోచన ఉందని ఆయన అన్నారు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో .. ఆ సందర్భం ఇప్పుడు కుదురుతుందో ఏమో! చూడాలి. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు.