ఏమిసోద‌రా..మ‌న‌సుకేమైందిరా

194
- Advertisement -

శరత్‌ కల్యాణ్‌, హనిగుప్త, మోహన్‌ వత్స, ఉపాసన హీరో హీరోయిన్లుగా జె.వి.ఆర్‌.సినిమాస్‌, వైష్ణవి ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై శ్రీనివాస్‌ నేదునూని దర్శకత్వంలో జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి నిర్మాతలుగా నూతన చిత్రం ‘ఏమి సోదరా..మనసుకేమైందిరా’ గురువారం ఉదయం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లోని దైవ సన్నిధానంలో లాంచనంగా ప్రారంభమైంది. తొలి స‌న్నివేశానికి తెలంగాణ మినిష్ట‌ర్ జగదీష్‌శ్వర్‌రెడ్డి క్లాప్‌ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత జె.వి.ఆర్‌, య‌మ‌ధ‌ర్మ‌రాజుగా, తాగుబోతు ర‌మేష్ చిత్ర‌గుప్తుడిగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ భోజ్‌పురి హీరోయిన్ రాణి చ‌టర్జీ స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నారు.

SIV

ఈ సంద‌ర్భంగా… కొత్త నటీనటులు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. నిర్మాతగానే కాకుండా ఈ సినిమాలో కీలకమైన పాత్ర యమధర్మరాజుగా నటిస్తున్నానని నిర్మాత‌ల్లో ఒక‌రైన జె.వి.ఆర్ తెలియ‌జేశారు. రెండు వంద‌ల‌కు పైగా బోజ్‌పురి చిత్రాల్లో న‌టించి తెలుగులో ఏమిసోద‌రా..మ‌న‌సుకేమైందిరా చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేస్తున్నాను రాణి ఛ‌ట‌ర్జీ తెలియ‌జేశారు. వైజాగ్‌ సత్యానంద్‌గారి వద్ద ట్రయినింగ్‌ తీసుకున్న శరత్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోగా నటిస్తున్నాడు. యాక్టర్స్‌ అందరూ కొత్తవాళ్ళే. ఈ చిత్రంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ గురించి చూపించబోతున్నాం. కానీ ప్రేమికుల గురించి ఈ సినిమాలో చూపించ‌మ‌ని ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల్లో ఒక‌రైన శ్రీనివాస్ నేదునూరి తెలియ‌జేశారు. మంచి టైటిల్‌తో సినిమా స్టార్ట్‌ చేశాం. దర్శకుడు శ్రీనివాస్‌గారు చెప్పిన కథ నచ్చింది. సినిమా ఆడియెన్స్‌కు నచ్చే విధంగా తెరకెక్కిస్తామ‌ని నిర్మాత దేశ్‌ముఖి రాజు యాద‌వ్ చెప్పారు.

Emi sodara

ఈ కార్యక్ర‌మంలో శ‌ర‌త్ క‌ల్యాణ్‌, మోహ‌న్ వ‌త్స‌, జెమిని వినోద్ , మ్యూజిక్ డైరెక్ట‌ర్ మెలోడీ శ్రీనివాస్‌,కృష్ణుడు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌: వాల్మీకి, సంగీతం: మెలోడి శ్రీనివాస్‌, కెమెరా: మురళీకృష్ణ, సహ నిర్మాత: పైల నర్సింహరావ్‌, నిర్మాతలు: జె.వి.ఆర్‌, దేశ్‌ముఖి రాజు యాదవ్‌, శ్రీనివాస్‌ నేదునూరి, రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌ నేదునూరి.

SIV

- Advertisement -