యెమన్ తీరంలో పడవ ప్రమాదం..

5
- Advertisement -

యెమెన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 154మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడగా ఈ ప్రమాదంలో 68మంది మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. 12 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.

రక్షించిన 12 మందిలో వారిలో పదకొండు మంది ఇథియోపియన్ జాతీయులు. ఒక్కరు యెమెన్‌కు చెందిన వారు ఉన్నారు. చాలా మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే, గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Also Read:‘సు ఫ్రమ్ సో’..రిలీజ్ డేట్

154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఆదివారం తెల్లవారు జామున దక్షిణ యెమెన్ ప్రావిన్స్ అబ్యాన్‌లోని అడెన్ గల్ఫ్‌లో మునిగిపోయిందని అబ్దుసత్తోర్ ఎసోయెవ్ తెలిపారు.

- Advertisement -