నాలుగోసారి సీఎంగా యడ్యూరప్ప

264
yeddyurappa
- Advertisement -

కర్ణాటకలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు నిన్నటితో తెరపడింది. సంకీర్ణ సర్కార్ కూలిపోవడంతో…బీజేపీ అధికారం చేపట్టనుంది. సరైన మెజార్టీ లేకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. నిన్న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించగా..కుమారస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించారు. విశ్వాసతీర్మానంపై డివిజన్ పద్ధతిలో ఓటింగ్‌ను స్పీకర్ నిర్వహించారు.

బలపరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ కు అనుకులంగా 99 మంది ఓట్లు వేయగా..బీజేపీకి 105మంది సభ్యులు ఓట్లు వేశారు. మ్యాజిక్ ఫిగర్ 103 కావడంతో బీజేపీకి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. అనంతరం పార్టీ లెజిస్లేచర్ పార్టీ భేటీ నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈక్రమంలో గురువారం యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలిసింది. యడ్యూరప్ప ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు (2007, 2008, 2018) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -