అరవింద సమేత..మూడో సాంగ్ వచ్చేసింది

276
ntr
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత..వీర రాఘవ’. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక-హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఏ కోనలో కూలినాడో.. అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది. కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట అని సిరివెన్నెల చెప్పారు. కత్తిమీద సామే నడకనుకుంటే.. పాడె పడకవుతుంది. ఆ పాడె మీద పడుకున్న వాడిని చూసి.. అయిన వాళ్ల కడుపుకోత ఎలాగుంటుందనేది ఈ పాట అన్నారు.

- Advertisement -