2024 ముగింపు దశకు వచ్చేసింది. ఇక వచ్చే సంవత్సరం బాలీవుడ్‌కు పలువురు స్టార్ నటుల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. వారి వివరాలను పరిశీలిస్తే.
సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ వెండి తెర ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన సర్జమీన్ చిత్రంలో ఇబ్రహీం తొలిసారిగా నటించనుండగా ఇందులో కాజోల్ కూడా నటించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ బిగ్ స్క్రీన్‌పై అలరించేందుకు రెడీ అవుతోంది.
అలాగే సంజయ్ పహారియా – స్మృతి షిండేల కుమారుడు వీర్ పహారియా స్కై ఫోర్స్ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ 2025లో పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆజాద్ చిత్రంలో రాషా తడానితో కలిసి నటించనున్నాడు. సంజయ్ కపూర్ – మహీప్ కపూర్ కుమార్తె షానయ కపూర్ సైతం 2025తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించనున్నారు.
Also Read:Bigg Boss 8: గౌతమ్‌ని హీరో చేసిన బిగ్ బాస్