వారసులంతా ఓటమే!

14
- Advertisement -

ఏపీ ఎన్నికల సంగ్రామంలో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు సీఎం జగన్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా కేవలం 13 స్థానాలకే పరిమితమైంది వైసీపీ.తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి ముందు వైసీపీ చిన్నబోయింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీ కూటమి 162 స్థానాలు గెల్చుకుని రికార్డు సృస్టించింది.

టీడీపీ కూటమి హవా ముందు వైసీపీ పూర్తిగా దెబ్బతింది. జగన్ కేబినెట్‌లో పెద్దిరెడ్డి తప్ప మిగితా మంత్రులు, కీలక నేతలు సైతం ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా వైసీపీ సీనియర్‌ నేతలు తమకు బదులు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు. అయితే, ఒక్కరు కూడా గెలవలేదు.

తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి, బందర్‌లో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఓటమిపాలయ్యారు.బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌, అంజాద్‌ బాషా, ఉషశ్రీ చరణ్‌, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, విడదల రజిని, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణు, జోగి ర‌మేశ్, ఆర్కే రోజా ఓటమి పాలయ్యారు.

Also Read:7 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

- Advertisement -