8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ

18
- Advertisement -

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో టీడీపీ కూటమి 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.

ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈసారి వైసీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఖాతా తెరవలేదు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్‌ జగన్‌ భారీ కసరత్తే చేశారు. దాదాపు 80కి పైగా సీట్లలో అభ్యర్థుల స్థానాలను మార్చారు. కానీ ఆ స్ట్రాటజీ ఏవీ వర్కవుట్‌ కాలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చిన అందరూ ఓడిపోవడం గమనార్హం.

Also Read:ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు..

- Advertisement -