Bigg Boss 7:రూ. 15 లక్షలతో బయటికొచ్చిన యావర్

88
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేలలో రూ.15 లక్షలతో బయటికొచ్చారు యావర్. 105 రోజుల పాటు ఆట రసవత్తరంగా సాగగా గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు చేశారు.

హౌస్‌లో మొత్తం ఆరుగురు ఫైనలిస్ట్‌లు ఉండగా అర్జున్, ప్రియాంక ఎలిమినేట్ కాగా తర్వాత వచ్చిన యావర్ రూ.15 లక్షలతో బయటికొచ్చారు. ప్రియాంక ఎలిమినేషన్ తర్వాత అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సైకిల్ మీద స్టేజీపైకి వచ్చారు. ఇవాళ రెండో ఎలిమినేషన్ బాధ్యతను రవితేజకు అప్పగించగా.. కలర్ పెయింట్‌లో ప్రియాంక ఫొటో రాగా.. ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు.

తర్వాత కంటెస్టెంట్లకు నాగ్ సరదాగా అవార్డులు ఇచ్చారు. తొలుత పిడకల అవార్డ్ దామినికి ఇవ్వగా ఇన్‌స్టంట్ నూడిల్ అవార్డు నయని పావనికి,వాటర్ బాటిల్ అవార్డు పూజకు ఇచ్చారు నాగ్. టాటూ ఆర్టిస్ట్ అవార్డు తేజకు.. రెడ్ లిప్‌స్టిక్ అవార్డు శుభశ్రీకి .. ఉడతా అవార్డు రతికకు.. సంచాలక్ అవార్డు సందీప్ మాస్టర్‌కు ప్రకటించారు.

Also Read:శృతి హాస‌న్ మౌనం.. కారణం అదేనా?

- Advertisement -