ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రక్షకులను ఆకట్టుకోగా తాజాగా టీజర్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చింది చిత్రయూనిట్.
వైఎస్‌గా మమ్మూట్టి నటించనుండగా పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రిలీజ్ చేశారు.
రైతులు పడుతున్న కష్టాలను ఈ టీజర్ ఆవిష్కరించింది. పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు అనే డైలాగ్స్ తో టీజర్ ఆకట్టుకోగా నేను విన్నాను.. నేనున్నాను అని మమ్ముట్టి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8 న ప్రేక్షకుల ముందుకురానుంది.