ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈమూవీకి తమిళ దర్శకుడు మహి వీ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వైఎస్ పాత్రలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారు.
వచ్చే నెల 8న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా తాజాగా ఈమూవీ సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ బోర్డ్ సభ్యులు.సుహాసిని, అనసూయ, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి పలువురు నటీనటులు కీలకపాత్రల్లో నటించారు.