Yatra 2 : టీజర్ రిలీజ్

26
- Advertisement -

మహి రాఘవన్ దర్శకత్వంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. 2019 ఎన్నికలకు ముందు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. వైఎస్‌గా మమ్ముట్టి నటించగా ఇప్పుడు దాని సీక్వెల్‌ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సీక్వెల్‌లో జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు. వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో రానుంది యాత్ర 2. దీనినే ట్రైలర్‌లో చూపించగా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ నటించారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read:జపాన్‌లో భారీ భూకంపం..

- Advertisement -