‘యాత్ర 2’తో ‘భ్రమయుగం’ కి లాభం

20
- Advertisement -

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో భ్రమయుగం అనే లేటెస్ట్ హర్రర్ యాక్షన్ డ్రామా నిన్న రిలీజ్ అయ్యింది. అటు కేరళలో ప్రస్తుతం మమ్ముట్టి ఫామ్ లో లేడు, ఇటు తెలుగులో కూడా మమ్ముట్టికి పెద్దగా మార్కెట్ క్రియేట్ కాలేదు. మొత్తానికి మమ్ముట్టి డిజాస్టర్స్ తో ఇబ్బందుల్లో ఉన్నాడు. మరోపక్క దర్శకుడు రాహుల్ సదాశివన్ కి కూడా సక్సెస్ లేకపోవడంతో భ్రమయుగం థియేటర్స్ లోకి వస్తుంది అన్నా అంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. పెయిడ్ ప్రీమియర్స్ తో కాస్త కదలిక వచ్చినా.. మొదటిరోజు బుకింగ్స్ పై అందరిలో అనుమానాలే.

ఇక భ్రమయుగం సినిమా విడుదలయ్యాక సినిమా పై మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిలబడదని అనుకున్నారు. మమ్ముట్టి పెరఫార్మెన్స్ బావున్నా.. వీక్ VFX, అలాగే ఎమోషన్స్ పండకపోవడం వంటి అంశాలతో ప్రేక్షకులు కూడా భ్రమయుగం కి మిక్స్డ్ టాక్ ఇచ్చారు. కానీ, టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రం రెండోరోజు కూడా బెటర్ ఫిగర్స్ నమోదు చేసింది. మరి యాత్ర 2 ఎఫెక్ట్ కావొచ్చు అని టాక్.

‘యాత్ర 2’ సినిమా ద్వారా మమ్ముట్టి ఓ వర్గం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అదే ఇప్పుడు భ్రమయుగం సినిమాకి బాగా కలిసి వచ్చింది. మొదటి రోజు మమ్ముట్టి దెబ్బకు భ్రమయుగం సినిమాకి 1.03 కోట్ల గ్రాస్ వచ్చాయి. అలాగే ఈ చిత్రం రెండో రోజు 0.70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన పబ్లిక్ టాక్ కి, క్రిటిక్ ఇచ్చిన రివ్యూస్ కి ఎక్కడా పొంతన లేకుండా భ్రమయుగం సినిమా కలెక్షన్స్ సాధిస్తుంది. మరి ఈ వీకెండ్ పూర్తయ్యాక దీని పెరఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:మహిళల్లో థైరాయిడ్.. ఎంత ప్రమాదమో!

- Advertisement -