‘యాత్ర 2’ ..హైలైట్ ఇదే

26
- Advertisement -

హీరో జీవా, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న పొలిటికల్ బయోపిక్ చిత్రం “యాత్ర 2”. ఇప్పటికే, ఈ సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే జగన్ ల జీవితాల్లో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తీ చేసుకుంది. ఈ సినిమా ఎలా ఉంది ? అని సెన్సార్ మెంబర్స్ లీకులు ఇచ్చారు. ఇంతకీ, ‘యాత్ర 2’ సెన్సార్ టాక్ ఏమిటంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వెల్ బ్యాంగ్ కి జగన్ పాత్ర పై ఓ ట్విస్ట్ హైలైట్ అవుతుందట.

అలాగే, ఎమోషనల్ సీక్వెన్స్ ప్రతిదీ యాత్ర 2 లో మెయిన్ హైలెట్ అనేలా ఉందట. ఇప్పటివరకు యాత్ర 2 పై ఎవరికైనా అనుమాలున్నా, అలాగే ట్రోలింగ్ ఉంటే.. అవన్నీ పక్కకి పోతాయంటూ సోషల్ మీడియాలో యాత్ర 2 సెన్సార్ టాక్ వినిపిస్తోంది. ఈ యాత్ర 2 మూవీ టాక్ చూసి జగన్ మోహన్ రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా హైప్‌ ను మ‌రింత పెంచేందుకు ఈ రివ్యూ బాగా పనికొస్తోంది. మరి ఈ రివ్యూ నిజమే అయితే, వైఎస్సార్ ఫ్యాన్స్ ఆనందానికి ఇక అవ‌ధులుండ‌వు. పైగా ఈ సినిమాలో జగన్ పార్టీకి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పబోతున్నారు.

పైగా యాత్ర 2 సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. జగన్ కి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రకు మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. ఇక యాత్ర 2 సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ కంటెంట్ తో నింపేశాడు. మరీ ముఖ్యంగా జగన్ పాత్ర నేపధ్యంలో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ పాత్ర ఏపీ ప్రజలకు గుర్తుండిపోవడం ఖాయం. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గా కాకండా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడట.

Also Read:Congress:కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.. షురూ!

- Advertisement -