సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకువచ్చింది. హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు.
పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది. తొలిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని… ప్రపంచవ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. దాదాపు 3 కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లకి, హిందీలో 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1 కోటి రూపాయలకి, ఓవర్సీస్ 2.5 కోట్లకి అమ్ముడయ్యాయి. మొత్తంగా దాదాపు 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ యశోద సినిమాకి జరిగింది. యశోద సినిమా హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సిందే.
ఇవి కూడా చదవండి..

