లాభాల బాటలో ‘యశోద’..!

79
yashoda
- Advertisement -

సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 11న ప్రేక్షకుల ముందుకువచ్చింది. హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ రాబట్టి మంచి వసూళ్లను రాబట్టింది.

ఇండియాలోనే కాదు ఓవ‌ర్‌సీస్‌లో కూడా సామ్‌కి తిరుగేలేదు. మూడు రోజుల్లో య‌శోద యు.ఎస్‌లో నాలుగు ల‌క్ష‌ల డాల‌ర్స్‌ను వ‌సూలు చేసింది. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 3.2 కోట్లు. దీంతో శ‌నివారం రోజుకే ఓవ‌ర్‌సీస్‌లో హ‌క్కులు కొన్న డిస్ట్రిబ్యూట‌ర్‌కి బ్రేక్ ఈవెన్ వ‌చ్చేసింది.

స‌రోగసీ నేప‌థ్యంలో సాగిన క్రైమ్ స‌స్పెన్స్‌ థ్రిల్ల‌ర్ ఇది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ , రావు ర‌మేష్‌, సంప‌త్‌, ఉన్ని ముకుంద‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -