వర్జినిటి కోల్పోయింది కాబట్టే హిట్ అట

51
- Advertisement -

చిన్న సినిమాగా విడుదలైన ‘బేబీ’ మూవీ కలెక్షన్లలో దుమ్ములేపుతూ ముందుకు సాగుతోంది. సినిమా రిలీజై రెండో వారాలు దాటుతున్నా.. సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. జూలై 14న విడుద‌లైన ఈ చిత్రం రూ.70 కోట్ల మార్కును దాటేసి రికార్డ్ స్థాయిలో దూసుకెళుతుంది. అయితే, ఈ చిత్రం నుంచి డైరెక్ట‌ర్ సాయిరాజేష్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ప్ర‌క‌టించారు. ఈ మూవీ ఆల్బమ్ లోని ఆరు పాటలు ఇప్ప‌టికే సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఏడవ పాటని విడుద‌ల చేస్తున్న‌ట్లు డైరెక్ట‌ర్ సాయిరాజేష్ ప్ర‌క‌టించారు. మరి ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. బేబీ క్యారెక్టర్ పై ఈ పాట ఉంటుందట.

అసలు బేబీ తప్పేం లేదు అని అమ్మాయిల సమస్యలు అలాంటివి అంటూ బేబీ కోణంలో ఈ పాట సాగుతుందట. నిజానికి ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలు బేబీ లాగే ఉన్నారని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా తమిళ నటి యశిఖ ఆనంద్ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ఈ బోల్డ్ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేసే యశిఖ ఆనంద్ కి బేబీ సినిమా చాలా బాగా నచ్చిందట. యశిఖ ఆనంద్ మాట్లాడుతూ.. ‘బేబీ సినిమాలో చాలా నిజాలు ఉన్నాయి. పైగా ఆ సినిమా నేటి తరం అభిరుచి’ అని యశిఖ చెప్పుకొచ్చింది.

Also Read:మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..!

యశిఖ ఆనంద్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పేం కాదు. ఇప్పటి రోజుల్లో అమ్మాయిలు పెళ్లికి ముందే కన్యత్వం కోల్పోవడం చాలా కామన్ అయిపోయింది. కాబట్టి.. దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. బేబీ సినిమలో మెయిన్ పాయింట్ ఇదే. అందుకే.. ఆ సినిమాని ప్రేక్షకులు అంత బాగా హిట్ చేశారు’ అని యశిఖ ఆనంద్ చెప్పుకొచ్చింది. మొత్తానికి పెళ్లికి ముందు వర్జినిటి కోల్పోవడం అసలు తప్పు కాదు అంటూ చెప్పడం ఒక్క యశిఖ ఆనంద్ కే సాధ్యం.

Also Read:Bro Review:పవన్ ” బ్రో ” హిట్ కొట్టాడా?

- Advertisement -