ING vs ENG :జైస్వాల్ ఔట్.. రాహుల్ ఇన్?

33
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో 2-1 తేడాతో టీమిండియా ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 23 నుంచి రాంచిలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నాలుగో టెస్టు ఇరు జట్లకు కూడా ఎంతో కీలకం. సిరీస్ రేస్ లో నిలవాలంటే నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తప్పనిసరిగా గెలవాల్సిఉంటుంది. అటు టీమిండియా నాలుగో టెస్టులో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇకపోతే నాలుగో టెస్టులో భాగంగా టీమిండియాలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీకర ఫామ్ లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. .

వెన్ను నొప్పి తో యశస్వి బాధ పడుతుండడంతో అతనికి రెస్ట్ ఇచ్చేందుకే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అతడికి విశ్రాంతి ఇస్తే అతని స్థానంలో ఎవరిని బరిలోకి దించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైన కే‌ఎల్ రాహుల్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ ఇన్ అయితే మిడిలార్డర్ లో ఎవరో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మిడిలార్డర్ లో సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జొరెల్ బాగానే రాణిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ వరుస ఆఫ్ సెంచరీలతో ఆరంగేట్ర మ్యాచ్ లోనే అందరి దృష్టి ఆకర్షించాడు. ఇకపోతే ధృవ్ జొరెల్ కీపింగ్ లో పరవలేదనిపించినప్పటికి బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో కే‌ఎల్ రాహుల్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే దృవ్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గెలుపే లక్ష్యంగా ఉన్న టీమిండియాలో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:ప్రియమణి… ‘భామా కలాపం 2’ సంచలనం..

- Advertisement -