లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

6
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ వైభవోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు, హోమాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం విద్యుద్దీపాలతో, పుష్పాలతో అలంకరించి భక్తిరస వాతావరణాన్ని సృష్టించారు.

ఈ నెల 24న ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవమూర్తులు ఆలయ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 25న తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. లక్ష్మీ అమ్మవారితో స్వామివారి దివ్య కల్యాణం వేదమంత్రాల నడుమ జరుగుతుంది. వేలాది దంపతులు ఈ కళ్యాణోత్సవాన్ని దర్శించి ఆశీర్వాదాలు పొందుతారు.

26వ తేదీన దివ్య విమాన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్వామివారిని అలంకరించిన రథం ఆలయ పరిసరాల్లో ప్రదక్షిణగా తీసుకెళ్తారు. 28న సహస్ర ఘటాభిషేకం నిర్వహించి స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

- Advertisement -