యాదాద్రి … ఆర్జిత సేవలు పునఃప్రారంభం

64
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.స్వామి వారికి భక్తులు జరిపించే నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు, బ్రహ్మోత్సవం, దర్భార్ వంటి సేవలు ఇవాళ్టి నుండి అందుబాటులోకి వచ్చాయి.

ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం ప్రసాద విక్రయకేంద్రంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వామి వారి మహాప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. అయితే సాధారణ పూజా వేళల్లో మార్పులు చేశారు. తెల్లవారుజామున 3.30 గంటలకు స్వామి వారి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 9.45కు ఆరగింపు, శయనోత్సవం అనంతరం ద్వారా బంధనం చేయనున్నారు.

- Advertisement -