యాదాద్రి శివాలయం పునర్నిర్మాణం

211
shivalayam
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం అయ్యాయి.స్వామి వారికి భక్తులు జరిపించే నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు, బ్రహ్మోత్సవం, దర్భార్ వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి.యాదాద్రి అనుబంధ దేవాలయం పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఇవాళ అంకురార్ఫణ జరగనుంది.

నేటి నుంచి ఈనెల 25వరకు శివాలయంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. 25న ఉద్ఘాటన మహోత్సవం జరుగుతుంది. ఈ ఉద్ఘాటన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతో పాటు తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వారుకూడా పాల్గోనున్నారు.

- Advertisement -