యాదాద్రి,భద్రాద్రి ఆలయాల్లో దర్శనాలు నిలిపివేత..

55
Yadadri temple

రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో భద్రాద్రి సీతారామ చంద్ర ఆలయం, యాదాద్రి దేవస్థానం వారు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకూ భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనాలను నిలిపేస్తున్నామని దేవస్థానం అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఆంతరంగికంగా మాత్రం స్వామి నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని ఈవో శివాజీ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగానే ఈ నిర్ణయమని ఆయన ప్రకటించారు.