గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యాదాద్రి కలెక్టర్

384
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అద్భతమైన స్పందన వస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్. ఈరోజు యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణం లో కలిగే మార్పులలో సమతుల్యత ఉండాలి అంటే మనకు 33 శాతం భూభాగం పచ్చగా, మొక్కలతో , చెట్లతో, అడవులతో ఉండాలి , కానీ అందులో 23 శాతం అటవీ ప్రాంతం ఉంది మిగిలిన 10 శాతం గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో చెట్లు నాటాలి దీనికి గ్రీన్ చాలెంజ్ ఎంతో దోహదపడుతుంది .ఈ చాలెంజ్ ని ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ చేయూతనివ్వాలి. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ని భావితరాలకు ఉపయోగకరమైన పని చేపట్టినందుకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ ను మరో ముగ్గురికి విసిరారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, జనగాం జిల్లా కలెక్టర్ మరియు భువనగిరి డి సి పి నారాయణ రెడ్డి ని మొక్కలు నాటాల్సిందిగా సవాల్ విసిరారు.

- Advertisement -