నేటి ‌నుంచి యాదాద్రి బ్రహ్మో‌త్సవాలు

123
ytda
- Advertisement -

శ్రీలక్ష్శీ‌న‌ర‌సిం‌హ‌స్వామి వార్షిక బ్రహ్మో‌త్సవాలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనుండగా ఈ నెల 28న మహా‌కుంభ సంప్రో‌క్షణ జరగనుంది. 10న ఎదు‌ర్కోలు, 11న తిరు‌క‌ల్యాణ మహో‌త్సవం, 12న దివ్యవి‌మాన రథో‌త్సవం, 13న మహా పూర్ణా‌హుతి, చక్రతీర్థం కార్యక్రమా‌లను నిర్వహించ‌ను‌న్నారు.

మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడోరోజు నుంచి స్వామివారి అలంకార సంబరా లు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదోరోజున చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలతో స్వామిక్షేత్రం 11 రోజుల పాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. పూర్వం స్వామివారి సన్నిధిలో వేదమంత్ర ఘోషలు వినిపించేవని అందుకే బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అని ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుందని అర్చకులు వెల్లడించారు.

- Advertisement -