- Advertisement -
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కశ్మీర్ లోని హిందువులని ఎంత దారుణంగా చంపేశారో చూపించారు. అయితే దీనిపై ఓ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడికి బెదిరింపులు వస్తుండటంతో ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం వివేక్ అగ్నిహోత్రికి ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించనుంది.
- Advertisement -