కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ సాహా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓ టెస్ట్ మ్యాచ్‌లో పది మందిని ఔట్‌చేసిన కీపర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ బ్యాట్స్ మెన్ మోర్కెల్‌ను క్యాచ్ అందుకున్న సాహా ఈ రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటివరకు లెజెండరీ వికెట్ కీపర్ ధోని పేరు మీద ఈ రికార్డు ఉండేది. 2014-15లో ఆసీస్‌తో మెల్ బోర్న్‌లో జరిగిన టెస్టులో ధోనీ 9 మందిని పెవిలియన్ బాటపట్టించారు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సాహా ఐదేసి క్యాచ్‌లు అందుకున్నాడు. ముఖ్యంగా నాలుగో రోజు అనూహ్యంగా చెలరేగిన ఇండియన్ పేస్ బౌలర్లు.. బౌన్స్, స్వింగ్‌తో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలోనే సాహా ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.
208 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాట్స్ మెన్ మరోసారి విఫలమయ్యారు. ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. 76 పరుగులకే ఆరు టాప్ ఆర్డర్ వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఇంకా 131 పరుగులు చేయాల్సిఉంది.

