- Advertisement -
ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తూనే ఉంది. ఇప్పటివరకు 213 దేశాలు కరోనా బారీన పడగా 7 లక్షలకు పైగా ఈ మహమ్మారితో మృత్యువాతపడ్డారు.
ఇప్పటివరకు 1,92,53,777 పాజిటివ్ కేసులు నమోదుకాగా 29,92,707 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 25,76,668 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో 7,02,642 మంది చనిపోయారు.
24 గంటల్లో 2,59,344 కేసులు నమోదుకాగా 6,488 మంది బాధితులు మృతిచెందారు. కరోనా కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్ధానంలో కొనసాగుతోంది. అమెరికాలో 50,32,179 పాజిటివ్ కేసులు ఉండగా తర్వాతి స్ధానంలో 29,17,562 కేసులతో బ్రెజిల్ ఉంది.
ఇక 20 లక్షల కేసులతో భారత్ మూడో స్థానంలో ఉండగా అమెరికాలో కరోనా మరణాలు ఇప్పటికే 1,62,800 దాటాయి. బ్రెజిల్‌లో లక్షకు చేరువ కాగా భారత్‌లో 41 వేల మంది కరోనాతో మరణించారు.
- Advertisement -