- Advertisement -
ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్ వేదికైంది. శంషాబాద్ సమీపంలోని చేగూర్ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ ధ్యాన కేంద్రంలో ఒకేసారి ఏకంగా ఒక లక్ష మంది ధ్యానం చేసుకోవచ్చు. ఇక కన్హా శాంతివనం పై నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. ఇందులో రోజుకు 1 లక్ష మందికి భోజనాలు పెట్టే విధంగా సదుపాయాలను ఏర్పాటు చేశారు. 350 పడకలు ఉన్న ఆయుష్ దవాఖాన, 6 లక్షల మొక్కలు కలిగిన నర్సరీలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి.
- Advertisement -