ప్రపంచకప్ 2019లో భాగంగా అరుదైన సంఘటన జరిగింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఓ ఆటగాడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు కానీ బంతి సిక్స్ వెళ్లింది.బంగ్లా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వింత జరిగింది.
ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ సౌమ్య సర్కార్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు ఆర్చర్. బంతి స్టంప్స్‌ను తాకి నేరుగా బౌండరీలైన్ అవతల పడింది. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో లైన్ అండ్ లెంగ్త్‌తో బంతిని వేయడంతో అది వికెట్లను తాకి నేరుగా 59 మీటర్ల దూరంలో ఉన్న బౌండరీలో పడింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి సిక్సర్ చూడలేదని నెటిజన్లు కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.
"Seen it go off the helmet before, but this is the first time!"
Jofra Archer on his remarkable delivery that went over the ropes off the bails. ⬇️ pic.twitter.com/9Y8KItHhbc
— ICC (@ICC) June 10, 2019