పండగలా తెలుగు మహాసభలు…

205
world telugu mahasabhalu Latest Updates
- Advertisement -

తెలుగు భాష – సాహిత్యాభివృద్ధి, వ్యాప్తిలో తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో తెలుగు మహాసభల అంకురార్పణ జరపాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులను, తెలుగు పండిట్లను ఆహ్వానించాలని సూచించారు. ప్రారంభ సభకు వచ్చిన పండితులను ఆన్‌డ్యూటీ అవకాశం ఇవ్వడంతో పాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అంకుర్పారణ సభ తర్వాత వారం, పది రోజుల పాటు సభలను నిర్వహించాలని సూచించారు.

తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు భాషాభివృద్ధికి, వివిధ రకాల సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని ముఖ్యమంత్రి చెప్పారు. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించాలని చెప్పారు. సినీరంగం, పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగానం, చందోబద్ధమైన ప్రక్రియలు తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రధానంశాలుగా తెలుగు మహాసభలు జరగాలని సూచించారు. పగటిపూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించాలని ఆదేశించారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, కవితా పోటీలను నిర్వహించాలని చెప్పారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని సూచించారు.

తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ముంబై, సూరత్, బీవండి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, షోలాపూర్ ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారున్నారు.. వారందరినీ మహాసభలకు ఆహ్వానించాలని ఆదేశించారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, గల్ఫ్ తదితర దేశాల్లో కూడా తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలున్నాయి.

పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణి నృత్య ప్రదర్శనతో పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించాలని సూచించారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని సిఎం సూచించారు. మహాసభల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఈ సభలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారులు శ్రీ కేవి. రమణాచారి, శ్రీ జి. వివేకానంద, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలుగు యునివర్సిటీ వీసి  సత్యనారాయణ, అంతర్జాతీయ తెలుగు సమాఖ్య డైరెక్టర్ ప్రొఫెసర్  మునిరత్నం నాయుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -