టోరంటో కెనడాలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సభ పల్లి బ్యాంకెట్ హాలులో తెలుగు భాషా ప్రియుల మధ్య ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నారై కన్వీనర్ మహేష్ బిగాల తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆహ్వానాన్ని అందించారు. ముందుగా ముడుపు విజయలక్ష్మి స్వాగతం పలుకగా సాయి కిరణ్, సాయి కృష్ణ తెలంగాణ రాష్ట్రీయ గీతం అందెశ్రీ రాసిన గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో మహేష్ బిగాల మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి ప్రపంచానికి భాషా పరిరక్షణకై పాలుపంచుకొమ్మని ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయవలిసింది గా కోరారు. TCAGT డైరెక్టర్, ఎంటర్‌ప్రైనర్ శ్రీ బెజవాడ సూర్య గారు తెలంగాణ ప్రభుత్వం చేబట్టిన సత్సంకల్పాన్ని ప్రశంసించారు. మాతృ భాషా పిల్లలకు దేర్యాన్ని, ఆత్మా గౌరవాన్ని పెంపొదిస్తుందని సత్యం మనబడి విద్యార్థుల ద్వారా స్పష్టం అవుతుంది అని గురునాథ్ దాసు అన్నారు. ఉర్దూ భాషను పాఠశాలల్లో రెండవ భాషా గా విద్యార్థులు నేర్చుకునేటట్లు చేసిన కెసిఆర్ గారికి రుణపడి ఉంటామని టీడీఫ్ జాయింట్ సెక్రటరీ శ్రీ అర్షద్ గోవి గారు అన్నారు. ఈ సభ యావతకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది అని తమవంతు కృషి చేస్తామని అన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాష పంచదార కన్నా, పాయసం కన్నా, చెరుకు రసం కన్నా, జును కన్నా తీయగా ఉంటుందని అన్నారు.