అట్లాంటాలో తెలుగు మహా సభల సన్నాహక సదస్సు..

192
World Telugu Conference in Atlanta
- Advertisement -

డిసెంబర్ 15 నుండి 19 వరకు తెలంగాణా రాష్ట్ర రాజధాని, హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులు వివిద దేశాల్లో నిర్వహించుట కొరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంలో భాగంగా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి సన్నాహక సదస్సు, తెలుగు భాషా పండితులకు మరియు సాహీతీ వేత్తలకు పెట్టింది పేరైన అట్లాంటా నగరంలో జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశెఖర్ రావ్ ఆదేశాలతో, తెలంగాణ సాహిత్య అకాడమి పక్షాన… ప్రపంచ తెలుగు మహా సభల ప్రవాస భారతీయ శాఖల సమన్వయకర్త మహేష్ బిగాల ముఖ్య అతిథి గా ఇక్కడికి వచ్చి తెలుగు వారందరిని ప్రపంచ తెలుగు మహాసభల కొరకు హైదాబాద్ వచ్చి ఇట్టి మహా సభలను విజయవంతం చేయాల్సిందిగా సాదరంగా అహ్వానం పలికారు.

World Telugu Conference in Atlanta

దీప ప్రజ్వలన అనంతరరం చదువులతల్లి సరస్వతి అమ్మవారిపై మీనక్షి రామడ్గు పాడిన పాటతో కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ముఖ్య అతిథి మహేష్ బిగాల మాట్లాదుతూ..ముక్యమంత్రి కేసీఆర్‌కి తెలుగు బాష పైనున్న మమకారం, సాహిత్యం మీదున్న ఆసక్తి గురించి వివరిస్తూ తెలుగు బాషను కాపాడుకోవడం కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి వివరించారు. తెలుగు బాష అందరిదని, బాషా పండితులు ఎక్కడివారైనా గౌరవించాల్సిన భాద్యత మన అందరిమీద ఉన్నదని అన్నారు. అమెరికా మరియు వివిద దేశాల నుండి వచ్చే వారికి ప్రభుత్వం కల్పించనున్న సదుపాయాలను వివరించారు. తర్వాత ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ప్రపంచ తెలుగు మహా సభల ఉద్దేశ్యాన్ని సవివరంగా వివరించారు. తర్వాత సభికులడిగిన ప్రశ్నలకు, సమాధానాలిచ్చారు.

ఇట్టి సదస్సుకు అట్లాంటా నగరం మరియు చుట్టు పక్కల ప్రాంతాలనుండి తెలుగు బాషా పండితులు, సాహితీ వెత్తలు, బాషా ప్రేమికులు మరియు అన్ని తెలుగు సంఘాల నాయకులు పాల్గొని సభను విజయవంతం చేసారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు బాబు దేవీదాస్ శర్మ మాట్లాడుతూ, తెలుగు సాహిత్యం ఎంతో ప్రాచీనమైనదని కొండాపూరు నందు లభ్యమైన శాశనాలను ఉటంకిస్తూ చెప్పారు. అలాగే తెలంగాణాలోని ఎన్నో సంస్థానాలు కవిపండితులను పోషించాయని అందులో గద్వాల సంస్థానం చాలా ప్రముఖమైనది చెబుతూ, గద్వాల సంస్థానములో జరిగిన శతావధానములోని పద్యాలను ఉదహరించారు.

World Telugu Conference in Atlanta

పిమ్మట ప్రముఖ సాహితీ పరిశోధకుడు, రచయిత శ్రీ.సురేష్ కొలిచాల మాట్లాడుతూ, తెలుగుభాష నేడు ఎంతోమంది మాట్లాడుతున్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో మన భాషకు ఇంకా సముచితమైన స్థానం దక్కలేదని, భాషను పరిరక్షించుకునే దిశగా మనమంతా అడుగులు వేయాలని, లేకపోతే మన భాష అనేక ఇతర దేశాలలోని భాషలాగే అంతరించే ప్రమాదం ఉందని చెబుతూ, భాషా పరిరక్షణ , వ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన చర్యలను ప్రశంసించారు. తరువాత కవి, రచయిత శ్రీ.ఫణి డొక్కా మాట్లాడుతూ తాను సాహితీ కర్షకుడనని చెబుతూ, తను వ్రాసిన కొన్ని చక్కని వృత్త పద్యాలను వినిపించారు. ఇంటర్మీడియెట్ వరకు తెలుగు బోధించాలి అని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, తెలుగు భాషను కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.

- Advertisement -