నిద్రలేమితో ముప్పే..ఈ జాగ్రత్తలు తీసుకోండి!

5
- Advertisement -

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అంతే కాకుండా రోజంగా పని ఒత్తిడి కారణంగా కూడా రాత్రివేళల్లో నిద్రకు భంగం వాటిల్లుతుంది. సరిగా నిద్ర లేకపోవడం వల్ల.. రోజంతా బద్దకం, అలసట, వంటి సమస్యలతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి.

చాలా మందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర కమ్ముకువస్తుంది. అయితే, మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదని అనుకుంటారు. కానీ మధ్యాహ్నం కాసేపు నిద్ర పోతే ఎంతో మేలు కలగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అయితే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. హాయిగా నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని.. దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం శరీరానికి అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ పడుకునే ముందు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలని చెబుతున్నారు.

పడుకునే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని.. వెలుతురు, శబ్దాలు లేకుండా ముఖ్యంగా చక్కటి పరుపు, దిండు ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. సుఖవంతమైన నిద్రకు మీరు తీసుకునే ఆహారానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం కాఫీ, సిగరెట్, ఆల్కహాల్​కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా స్పైసీ ఫుడ్, అధిక ఆహారం తీసుకోవడం కూడా నిద్రకు భంగం కలిగిస్తాయని చెబుతున్నారు.

Also Read:TTD: 25న కోయిల్ అల్వార్ తిరుమంజనం

- Advertisement -