నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభా 2100 నాటికి 10.9 బిలియన్లకు చేరుకుంటుదని అంచనా వేసింది. ఒకప్పుడు ప్రపంచ జనాభా 1 బిలియన్కు పెరగడానికి వందల వేల సంవత్సరాలు పట్టింది కాని ఆ తర్వాత మరో 200 సంవత్సరాలలో అది ఏడు రెట్లు పెరిగిందన్నారు. ఇది 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్క్‌కు చేరుకుంది… ఇది 2021లో దాదాపు 7.9 బిలియన్లకు చేరుకుంటుందని మరియు 2030 నాటికి దాదాపు 8.5 బిలియన్లకు, 2050 నాటికి 9.7 బిలియన్లకు చేరుకుంటదని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
మెరుగైన వైద్య సదుపాయాల వల్ల మాతృ మరణాలు మరియు శిశు మరణాలు తగ్గిపొవడం మరియు అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ అభివృద్ధికి దారితీసిన ఆరోగ్య రంగం పురోగతి వల్ల ప్రపంచ జనాభా పెరిగిపోతుందన్నారు. మన జీవితాలను సులభతరం చేసిన సాంకేతిక ఆవిష్కరణల వల్ల మానవ ఆయుర్ధాయం పెరగడం ఒక కారణంగా చెప్పవచ్చన్నారు. సంతానోత్పత్తి రేటులో పెద్ద మార్పులు, పట్టణీకరణ పెరగడం మరియు వలసలు వేగంగా విస్తరించడం వంటి వాటితో కూడా జనాభా పెరుగుదలకు దోహద పడుతున్నాయని వివరించింది ఐక్యరాజ్య సమితి.
1970ల ప్రారంభంలో, స్త్రీలు సగటున ఒక్కొక్కరు 4.5 మంది పిల్లలను జన్మనిచ్చారు కాని 2015 నాటికి, ప్రపంచంలోని మొత్తం సంతానోత్పత్తి ప్రతి స్త్రీకి 2.5 కంటే తక్కువకు పడిపోయిందన్నారు. ఇదే విధంగా సగటు ప్రపంచ జీవితకాలం 1990ల ప్రారంభంలో 64.6 సంవత్సరాల ఉండగా అది 2019లో 72.6 సంవత్సరాలకు పెరిగిందన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 66 శాతం మంది నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధి, ఉపాధి, ఆదాయ పంపిణీ, పేదరికం మరియు సామాజిక రక్షణలను ప్రభావితం కూడా చేస్తున్నాయన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, గృహాలు, పారిశుద్ధ్యం, నీరు, ఆహారం మరియు శక్తిని నిర్ధారించే అంశాలు కూడా ప్రపంచ జనాభాను ప్రభావితం చేస్తున్నాయన్నారు.
యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచ జనాభా గురించి మాట్లాడుతూ…ఎనిమిది బిలియన్ల ప్రపంచ జనాభాను చేరుకోవడం సంఖ్యాపరమైన మైలురాయి, కానీ మన దృష్టి ఎల్లప్పుడూ ప్రజలపైనే ఉండాలి. మేము నిర్మించడానికి ప్రయత్నిస్తున్న ప్రపంచంలో, 8 బిలియన్ల మంది ప్రజలు గౌరవప్రదమైన మరియు సంతృప్తికరమైన జీవితాలను జీవించడానికి 8 బిలియన్ల జనాభాకు అవకాశాలు కల్పించడం మన భాధ్యతన్నారు