అమరావతిలో వరల్డ్ పాపులేషన్ డే

9
- Advertisement -

అమరావతిలో వరల్డ్ పాపులేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. జనాభా అనేది భారం కాదు.. ఒక ఆస్తి అని తెలిపారు చంద్రబాబు.

ఈరోజు అగ్రరాజ్యాలతో భారత్ పోటీ పడుతోంది అంటే దానికి మన మానవ వనరులే కారణం… ఒకప్పుడు జనాభా నియంత్రణ చేయాలని నేనే చెప్పా అని చెప్పారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా జనాభా నిర్వహణ ముఖ్యమని చెబుతున్నా అన్నారు. గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని చులకనగా చూశారు… యువత లేకపోతే దేశాభివృద్ధి ఆగిపోయినట్లేనని తెలిపారు.

మరోవైపు కాకినాడ మెడికల్‌ కాలేజీ లైంగిక వేధింపుల ఘటనపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు అధికారులు. కళ్యాణ్‌ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కలిసి విద్యార్థినులను వేధించారని సీఎంకు చెప్పారు అధికారులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరోవైపు.. వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురుపై సస్పెన్షన్ వేటు వేయగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

Also Read:సాగునీటి గోస..కాంగ్రెస్‌దే పాపం!

- Advertisement -